జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ కేంద్రంలో బస్టాండ్ దగ్గర అఖిల పక్ష కమిటీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వడ్డే రాజేశ్వరికి ఘన నివాళులర్పించారు. మల్దకల్ మండలం, బిజ్వారం గ్రామానికి చెందిన వడ్డె రాజేశ్వరి ఆత్మహత్యకు కారణమైన బండ్ల రాజశేఖర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, అలాగే అత్యుత్సాహం చూపిన మల్లకల్ ఎస్సై ని కూడా సస్పెండ్ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.