జోగులాంబ: నది హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఎమ్మెల్యే విజయుడు దర్శించుకున్నారు. ఆలయ ఈవో పురేందర్ కుమార్ ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేని ఆహ్వానించారు. స్వామి, అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేని శేష వస్త్రాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.