మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జియంఆర్) తండ్రి గవినోళ్ళ. కృష్ణారెడ్డి(80) గురువారం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన ఉదయం దమగ్నాపుర్ తన నివాసంలో కన్నుమూశారు. అంత్యక్రియలు సాయంత్రం 4: 30గం. కు వారి స్వగ్రామం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించబడును. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.