మాదిగల న్యాయమైన డిమాండ్ అయిన ఎస్సీ వర్గీకరణ కోసం సబ్బండ వర్గాలు సహకరించాలని ఎమ్మార్పీఎస్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు రొట్టె శేఖర్ అన్నారు. గురువారం దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కళాకారుల కవాతు-మహా ప్రదర్శన నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహం వద్ద వర్గీకరణకు మద్దతుగా నినాదాలు చేశారు. ఫిబ్రవరి 7న జరిగే 'వెయ్యి గొంతులు లక్ష డప్పులు' కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.