రైతులకు రెండు లక్షల రుణమాఫీ చెయ్యాలని దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గ రైతుల పక్షాన గురువారం నిర్వహించే ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గంలో రుణమాఫీ కానీ రైతులు గ్రామాలలో రుణమాఫీ కానీ రైతుల వివరాలు తీసుకురావాలని టీఆర్ఎస్ నాయకులకు మాజీ ఎమ్మెల్యే సూచించారు.