దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డితో కలిసి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 35 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాంమని, సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసి, హాస్పిటల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు.