మహబూబ్ నగర్: చట్ట సభలలో 33శాతం రిజర్వేషన్లను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి:

81చూసినవారు
ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన మహిళా సాధికారత సదస్సుకు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరుణ మాట్లాడుతూ మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం, ఆవశ్యకత పట్ల తన అనుభవాన్ని పంచుకున్నాను. మహిళలకు చ‌ట్ట‌స‌భ‌ల్లో 33శాతం రిజర్వేషన్లు రాబోతున్నాయని అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్లను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్