గట్టు: గ్రామ పంచాయతీ వర్కర్లకు పని భద్రత కల్పించాలి
గట్టు మండల కేంద్రంలో MPO రవి కుమార్ కు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచెడు కార్తీక్ మాట్లాడుతూ జీవో నెంబర్ 60 ప్రకారం గ్రామపంచాయతీ వర్కర్లకు ప్రతినెల 5వ తారీకులోపు వేతనాలు ఇవ్వాలి. పెండింగ్లో ఉన్నఆరు నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరారు.