జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ తిరుపాజీ ఒక ప్రకటనలో సూచించారు. మద్యం సేవించి రోడ్లపైకి రాకూడదని, ఇప్పటికే నాలుగు డ్రంకన్ డ్రైవ్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ నూతన సంవత్సరాన్ని కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని సూచించారు. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడితే రూ. 10 వేల జరిమానా, వారం రోజుల పాటు జైలు శిక్ష పడుతుందని తెలిపారు.