కల్వకుర్తి మండలం మాచర్ల గ్రామంలో మంగళవారం ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకొని గ్రామ పురవీధుల గుండా తిరుగుతూ దోమల నివారణ గురించి అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు తోటపల్లి పి హెచ్ సి సూపర్వైజర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు మంజుల, సూర్య కళ, సూపర్వైజర్ యశోద, వైద్యులు శరత్ కుమార్ రెడ్డి, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.