సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మున్సిపల్ చైర్మన్

492చూసినవారు
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మున్సిపల్ చైర్మన్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీ 21వ వార్డు కౌన్సిలర్ సైదులు గౌడ్ తో కలిసి మంగళవారం ఉదయం 9 గంటలకు కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం సందర్శించారు. ఇందిరానగర్ నివాసులు మిషన్ భగీరథ వాటర్ సమస్య ఉందని వాటర్ రావడం లేదని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన వాటర్ మెన్స్ శీను. సంతోష్ లను పిలిచి మాట్లాడడం జరిగింది. కాలనీ వాసులతో మాట్లాడుతూ మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరిస్తానని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అలాగే ఇంద్రానగర్ కాలనీ ఏడవ నెంబర్, ఐదవనెంబర్, రహదారిలో జరుగుతున్న సిసిరోడ్ల పనులను పరిశీలించడం జరిగింది.

ఇంద్రానగర్ కాలనీవాసులు మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న ఎడ్మ సత్యం ఇంద్రానగర్ కాలనీలో ప్రధానసమస్యలుగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. సిసి రోడ్లు శరవేగంగా ఎంతో నాణ్యతతో పూర్తి చేయడం జరిగిందని ఇంద్ర నగర్ కాలనీ తరపున చైర్మన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం మాట్లాడుతూ ఇంద్రానగర్ కాలనీలో విశాలమైన రోడ్లు ఉన్నాయని ప్రధాన సమస్యగా ఉన్న సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఎంతో నాణ్యతలతో పూర్తి చేయడం జరిగిందని ఇంద్రానగర్ కాలనీలో ఉన్న నీటి సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తానని ఇంద్రానగర్ కాలనీలో రోడ్డుకు ఇరువైపులా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించుకోవాలని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిజనల్ వ్యాధులు రాకుండా కాపాడుకోవాలని సూచించారు.

ఈ మధ్య వరుస దొంగతనాలు జరుగుతున్నాయని కాలనీ వాళ్లకు జాగ్రత్తలు తెలియజేస్తూ ఎవరైనా ఊరికి వెళ్లేటప్పుడు కల్వకుర్తి పోలీస్ వారికి తప్పక సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. ఏలాంటి సమస్యనైనా 21 వ వార్డు కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సైదులు గౌడ్ టిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నెరటి శేఖర్ 21వార్డు అధ్యక్షుడు గజ్జ శేఖర్ గౌడ్. బండారి శ్రీనివాసులు. శ్రీధర్. సాయి గౌడ్. జుంబులు. హబీబ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్