నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలో శనివారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయం యందు పుర చైర్మన్ ఎడ్మ సత్యం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుర ఛైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంత రూపకర్త ఆచార్య జయశంకర్ అని తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాలలో వారి పాత్ర వర్ణించలేనిదని వారి కృషి, ప్రోత్సహం మరియు వారి సిద్ధాంత పటిమల వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సహకరమైనదని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఛైర్మన్ రాచోటి శ్రీశైలం, పీఏసీఎస్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్లు సూర్యప్రకాష్ రావు, భోజి రెడ్డి, సైదులు గౌడ్, కోఆప్షన్ మెంబర్ మనోహర్ రెడ్డి నాయకులు నూనె శ్రీనివాస్, కనుక సత్యనారాయణ, నగేష్, మునిసిపల్ కమిషనర్ జాకీర్ హమ్మద్ మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.