వెల్దండ మండల కేంద్రంతో పాటు సబ్ స్టేషన్ పరిధిలోని ఆయా గ్రామాలకు ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ సూర్య నాయక్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సబ్ స్టేషన్ లో మరమ్మతుల పనుల కారణంగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఏఈ సూర్య నాయక్ పేర్కొన్నారు. వినియోదారులు రైతులు సహకరించాలని కోరారు.