హన్వాడ మండలం టెంకర్ గ్రామానికి చెందిన కే భాస్కర్ భార్య కే. పార్వతమ్మ అపస్మారక స్థితిలోకి పోవడం వల్ల కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన హన్వాడ 108 సిబ్బంది టెక్నీషియన్ మహబూబ్ బాషా, పైలట్ అంజిలయ్య అక్కడకు చేరుకొని పార్వతమ్మను అంబులెన్స్ తీసుకొని వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేసి డాక్టర్ సురేష్ సలహా మేరకు ట్రీట్మెంట్ చేసుకుంటూ మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.