మక్తల్: రేషన్ దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

82చూసినవారు
మక్తల్ మండలం ఎర్సన్ పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాన్ని శుక్రవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు సరుకులు అందజేశారు. రేషన్ దుకాణాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే బియ్యం సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. గ్రామంలో రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్