నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఐయినాపూర్ లో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ నవీద్ మంగళవారం తెలిపారు. ఐయినా పూర్ కు చెందిన రామలింగమ్మకు కర్ణాటకకు చెందిన జగదీష్ తో 4ఏళ్ళ క్రితం పెళ్లి కాగ భర్త మద్యానికి బానిసై గొడవ పడేవాడని భార్య పుట్టింటికి రాగా సోమవారం మృతుడు మళ్లీ గ్రామానికి వచ్చి భార్యతో గొడవపడి పురుగుల మందు తాగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.