క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

62చూసినవారు
క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానీయులు త్యాగాల ఫలితంగా స్వాతంత్రం వరించిందని దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరు పాటు పడుతూ మహానీయుల అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్