లింగాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

75చూసినవారు
లింగాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
లింగాల మండలం ధారారం గ్రామానికి చెందిన గుర్రాల బొజ్జయ్య (52) మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ఆదే గ్రామానికి చెందిన వీరపాగ రేణుకను ఎక్కించుకొని ఇంటికి వెళ్తుండగా లింగాల శివారులో అదుపుతప్పి చెట్టుకు బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108లో నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే బొజ్జయ్య మృతి చెందాడు. కుమారుడు శ్రీశైలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్