అచ్చంపేట లో మిలాద్ ఉన్ నభి ముబారక్ సందర్భంగా జమ మసీద్ వద్ద మసీద్ కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛంధ రక్తదాన శిబిరం ఎమ్మెల్యే వంశి కృష్ణ గురువారం ప్రారంభించారు. గర్భవతులకు, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను రక్షించేలా రక్తదానం చేసేందుకు రక్త దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ముఖ్యంగా రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలన్నారు. రెడ్ క్రాస్ సొసైటి జిల్లా సెక్రటరీ రమేష్ రెడ్డి పాల్గొన్నారు