నారాయణపేట: పెండింగ్లో ఉన్న కార్మికుల వేతనాలు చెల్లించాలి

53చూసినవారు
నారాయణపేట: పెండింగ్లో ఉన్న కార్మికుల వేతనాలు చెల్లించాలి
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించిన పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని టియుసిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింలు డిమాండ్ చేశారు. నారాయణపేట పట్టణంలోని భగత్ సింగ్ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన టియుసిఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. సుమారు 6 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని వెంటనే వాటిని చెల్లించాలని కోరారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్