నారాయణపేట మండలం సింగారం చౌరస్తాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆర్టీసీ బస్ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన మహిళను దామరగిద్ద మండలం వత్తుగుండ్ల గ్రామానికి చెందిన మాణిక్యమ్మ గా గుర్తించారు. బస్సు ఎక్కేందుకు వస్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కొరకు జిల్లా ఆసుపత్రికి తరలించారు.