నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఈస్టర్ పర్వదినాన్ని క్రైస్తవులు భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మూడు చర్చిలతో పాటు మండలంలోని బైరంకొండ, కొల్లంపల్లి, సింగారం గ్రామాల్లోని చర్చిలలో ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సింగారం గ్రామంలో ఉదయం ప్రభువును స్మరిస్తు పాటలు పాడుతూ వీధుల గుండా బయలుదేరి కల్వరి కొండ (గుట్ట) కు చేరుకొని అక్కడ ఉదయపుకాల ఆరాధన కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్థానిక ఇమ్మెన్యూయేల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ రెవ నగేష్ మాట్లాడుతూ ప్రభువు మరణాన్ని జయించి సమాధి నుంచి మృత్యుంజయునీగా లేచిన దిన్నానే ఈస్టర్ అని ఇది ఒక పర్వదినంగా క్రైస్తవులు భక్తి శ్రద్దలతో ఆచరిస్తారాని అన్నారు. అనంతరం ఏసుక్రీస్తు జీవిత పునరుత్థానంపై సందేశాన్ని వినిపించారు. మహిళలు యేసయ్య పాటలతో గీతాలాపన చేశారు. అయా కార్యక్రమాల్లో చర్చీల పాస్టర్లు, సంఘ కాపరులు, క్రైస్తవ సమాజ పెద్దలు, చర్చి కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.