జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నూతన ఎస్సైగా వెంకటస్వామి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్‌లో ఉన్న సిబ్బంది పూల కొచ్చెలతో ఆయనకు స్వాగతం పలికారు. నూతన ఎస్ఐ మాట్లాడుతూ ఎలాంటి అక్రమాలు జరగకుండా చూస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ బృందం, అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.