మాజీ మంత్రి కేటిఆర్ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ ఆధ్వర్యంలోశుక్రవారం కాంగ్రెస్ శ్రేణులు కేటిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పుర వైస్ ఛైర్మన్ పాకనాటి కృష్ణయ్య, పుర కౌన్సిలర్స్ వెంకటేశ్వర్లు, చీర్ల సత్యం సాగర్, విభూతి నారాయణ, లక్ష్మీ రవియాదవ్, సుమిత్ర యాదగిరి, జయసుధ మధుగౌడ్ భువనేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.