వనపర్తి జిల్లాలో గ్రూప్-2 మొదటి రోజు పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పలువురు అభ్యర్థులు ఉదయం 9. 30 లకు ముందే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. హాల్ టికెట్, గుర్తింపు కార్డుతో వచ్చిన అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అధికారులు లోపలికి అనుమతించారు. జిల్లా వ్యాప్తంగా 8, 569 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. గ్రూప్-2 పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.