ఎలిమినేటర్ మ్యాచ్‌పై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

59చూసినవారు
ఎలిమినేటర్ మ్యాచ్‌పై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాజస్థాన్, బెంగళూరు మధ్య నేడు జరుగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌పై భారత దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో కూడా ఫలితం ఏకపక్షమే అవుతుందని వ్యాఖ్యానించాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీ అద్భుతం చేసిందని, ఫాఫ్‌, విరాట్ సహా ఇతర సీనియర్లు బాధ్యతతో ఆడుతూనే కుర్రాళ్లను ముందుండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో వరుస ఓటములతో ఉన్న రాజస్థాన్ మ్యాజిక్‌ చేస్తేనే విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్