హైదరాబాద్‌లో నిన్న జర్మన్ యువతిపై ఓ కారు డ్రైవర్ అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నిందితుడు అస్లాంను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఉన్న స్నేహితుడి కోసం మార్చి తొలి వారంలో జర్మనీ యువతి నగరానికి వచ్చింది. అతడి ఇంట్లో ఉంటూ నగరాన్ని సందర్శించింది. తిరిగి ఆ యువతి తమ దేశానికి వెళ్లిపోయేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా.. కారు డ్రైవర్ ఆ యువతిపై అత్యాచారం చేశాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు.