గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జునాగఢ్-వెరావల్ హైవేపై భండూరి గ్రామ సమీపంలో సోమవారం ఉదయం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పరీక్షకు వెళ్తున్న ఐదుగురు విద్యార్థులు సహా ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.