తామర పురుగులు మొక్క ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేడయం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఆకులపై, కాడలపై ఊదారంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. వీటి నివారణకు డైమిథోయెట్ (లేదా) ఫిప్రొనిల్ 2mlను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగులకు ఆశ్రయమిచ్చే వెల్లుల్లి, క్యాబేజీ, టమాటా, దోస వంటి పంటలను ఉల్లికి సమీపంలో సాగు చేయకూడదు.