ప్రియుడిపై ప్రియురాలి భర్త దాడి

75చూసినవారు
ప్రియుడిపై ప్రియురాలి భర్త దాడి
AP: తన భార్యతో మాట్లాడుతున్న ప్రియుడిపై ఆమె భర్త చితక్కొట్టిన ఘటన వైఎస్సార్ జిల్లా మదనపల్లెలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఇంద్ర (20) ఓ వివాహితకు ఫోన్ చేసి ఆస్పత్రి వద్దకు పిలిపించుకుని మాట్లాడుతుండగా.. అదే సమయంలో ఆమె భర్త, అతని అనుచరులు అక్కడికి చేరుకున్నారు. వీరిద్దరిని గుర్తించి రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఇంద్ర గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్