అంత్య క్రియలకు వెళ్ళి.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

558చూసినవారు
అంత్య క్రియలకు వెళ్ళి.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
డీసీఎం ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటన HYD పటాన్ చెరు పరిధిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పడమటి లక్ష్మణ్ అనే యువకుడు స్థానిక గుమ్మడిదలలోని బంధువు అంత్య క్రియలకు బైక్ పై వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో వీరన్నగూడ ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న డీసీఎం అదుపు తప్పి బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో లక్ష్మణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్