అండర్-19 మహిళల ప్రపంచ కప్‌లో భాగంగా నేడు స్కాట్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తెలుగమ్మాయి గొంగడి త్రిష చెలరేగి ఆడింది. 53 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించింది. 13 ఫోర్లు, 4 సిక్సర్లతో మొత్తంగా 110 పరుగులు చేసింది. గొంగడి త్రిష భారీ ఇన్సింగ్స్ ఆడడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.