తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు విప్రో కన్జ్యూమర్ కేర్ 9వ ఎడిషన్ స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించింది. పదో తరగతి, ఇంటర్ (2023-24 విద్యా సంవత్సరం) ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి.. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ కోర్సులో ఆడ్మిషన్ పొందిన విద్యార్థినులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రతిభ ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తామని సంతూర్ ప్రతినిధులు ప్రకటించారు. ఏడాదికి రూ. 24వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అర్హత గల విద్యార్థినులు సెప్టెంబర్ 30లోపు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.