తెలంగాణ ప్రజలకు శుభవార్త

77చూసినవారు
తెలంగాణ ప్రజలకు శుభవార్త
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ‘ఎల్‌ నినో పరిస్థితులు జూన్‌ నాటికి పూర్తిగా బలహీనపడతాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు జూన్‌ 8, 11వ తేదీల మధ్య రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని తెలిపింది. ఆ వెంటనే వానలు ప్రారంభమై జులైలో భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పింది. ఉమ్మడి ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండతోపాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని కొంత భాగంలో అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్