భూమిలేని పేదలకు ప్రతి కుటుంబానికి రూ.12 వేలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో 4 చోట్ల ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం జరగనుందని తెలిపారు. కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు. అన్ని జిల్లాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు.తాము BRS నేతలు చెప్పినట్లుగా అబద్ధాలు చెప్పలేమని.. వారి ప్రచారాలను నమ్మొదన్నారు.