ప్రభుత్వ ఆస్తులు అదానీకి రాసివ్వడం లేదు: సీఎం రేవంత్

55చూసినవారు
ప్రభుత్వ ఆస్తులు అదానీకి రాసివ్వడం లేదు: సీఎం రేవంత్
విద్యుత్తు వ్యవస్థను ప్రైవేటీకరణ చేస్తూ అదానీకి కట్టబెట్టడమేనన్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘మేం మోదీలా ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను అదానీకి రాసివ్వడంలేదు. అదానీని విద్యుత్తురంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నాం అంతే. రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టినా ఆహ్వానిస్తాం’ అని అన్నారు. కాగా హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ పంపిణీ, బిల్లుల వసూలు బాధ్యతను ప్రభుత్వం అదానీ కంపెనీకి అప్పగించింది.

సంబంధిత పోస్ట్