పంట దిగుబడి పెంచేలా తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు అధునాతమైన యంత్ర పరికరాలు అందించేందుకు సిద్ధమవుతోంది. యాసంగి పంట కాలం నుంచే రైతులకు 50 శాతం రాయితీపై పంపిణీ చేయాలని భావిస్తోంది. కాగా ఈ స్కీమ్ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.26 కోట్లు కేటాయించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.20 కోట్లు మంజూరు చేసింది. అంతేకాకుండా నేరుగా వ్యవసాయ శాఖ నుంచే వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది.