గవర్నర్‌ 15 బిల్లుల్ని వెనక్కి పంపారు: డీకే శివకుమార్‌

81చూసినవారు
గవర్నర్‌ 15 బిల్లుల్ని వెనక్కి పంపారు: డీకే శివకుమార్‌
గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ బీజేపీకు అనుకూలంగా పనిచేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం పంపిన 15 బిల్లులను గవర్నర్‌ వెనక్కి పంపారు. ‘భాజపాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎందుకు?’ అని ప్రశ్నించారు. బిల్లుకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు ఉంటే ప్రభుత్వం సమాధానమిస్తుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్