ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోనేరు హంపి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 110 మంది క్రీడాకారిణల మధ్య స్విస్ ఫార్మాట్లో 11 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో హంపి 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్‌ను దక్కించుకుంది. ఆమెకు రూ.51.23 లక్షల ప్రైజమనీ లభించింది. 10వ రౌండ్ ముగిశాక హంపితోపాటు మరో ఆరుగురు క్రీడాకారిణులు అగ్రస్థానంలో నిలిచారు. ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ చరిత్రలో హంపి నాలుగు పతకాలు సాధించింది.