మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు, కృష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో గుడివాడ టీడీపీ కార్యాలయం, ఆ పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో కాళీని కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించి అతడిపై కేసు నమోదు చేశారు. తాజాగా కాళీని అసోంలో గుడివాడ పోలీసు బృందాలు పట్టుకున్నాయి. మరోవైపు, ఇప్పటికే ఈ కేసులో 13 మంది వైసీపీ కార్యకర్తలు అరెస్టయి రిమాండ్లో ఉన్నారు.