రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన గోవిందా

567చూసినవారు
రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన గోవిందా
బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు గోవింద 14 ఏళ్ళ తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గతంలో కాంగ్రెస్‌లో చేరిన గోవింద 2004 ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న గోవింద ఇటీవలె మహారాష్ట్రలోని శివసేన షిండే వర్గంలో చేరారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో వాయవ్య ముంబై నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. బాలీవుడ్‌లో ఫేమస్ కమెడియన్‌గా ఉన్న గోవింద 165 హిందీ సినిమాల్లో నటించారు.

సంబంధిత పోస్ట్