రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ

74చూసినవారు
రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ
యాసంగి సీజన్ లో 47.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ధాన్యం విక్రయించిన 3 రోజుల్లోనే దాదాపు 8.35లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.10,355 కోట్లు జమ చేసినట్లు తెలిపింది. చాలా చోట్ల సేకరణ ప్రక్రియ పూర్తయిందని, మరో 10 రోజులపాటు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రావొచ్చని పేర్కొంది. ఈ నెలాఖరు వరకు అవసరమైన ప్రాంతాల్లో కేంద్రాలను తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్