HYD: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పిడికిలి బిగించి BRS ఎమ్మెల్సీ కవిత జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కొందరు కార్యకర్తలు సీఎం.. సీఎం' అంటూ నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా బంజారాహిల్స్ లోని ఆమె నివాసానికి బయల్దేరారు. కవితకు స్వాగతం పలుకుతూ హైదరాబాద్ రోడ్లపై భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. రేపు మధ్యాహ్నం కవిత ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ను కలవనున్నారు.