TG: ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిన 20 సంవత్సరాలుగా విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన 80 ఏళ్ల బాల్ రెడ్డి 1970 నుంచి 2004 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే ఇంట్లో ఖాళీగా ఉండటం ఇష్టం లేక ప్రజ్ఞాపూర్, తిమ్మక్కపల్లి, క్యాసారం ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లిష్ పాఠాలు చెబుతున్నారు. రోజూ 15 కి.మి సొంతడబ్బుతో ప్రయాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.