AP: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘బాబు కోసం పుట్టిన తమ్ముడు పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!’ అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్‌లకు అంబటి ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.