ఎలాన్ మస్క్‌కు చెందిన ‘xAI’ అనే కృత్రిమ మేధ స్టార్టప్ సంస్థ తాజాగా ‘Grok-3’ సేవల్ని ప్రారంభించింది. ఇందులో GPT-4o వంటి ప్రీ-ట్రైన్డ్ మోడల్, 2 రీజనింగ్ మోడల్స్, డీప్‌సెర్చ్ అనే AI ఏజెంట్ ఉన్నాయి. ఈ మోడల్‌ను భూమిపైన అత్యంత తెలివైన ‘AI’గా అభివర్ణించిన మస్క్, ఇప్పటికే ఉన్న అన్ని AI మోడల్ సామర్థ్యాలను ఇది అధిగమిస్తుందన్నారు. ప్రస్తుత చాట్‌బాట్‌ల కంటే ఇది మరింత పనితీరును కనబరుస్తుందని చెప్పారు.