టాటా ఏఐజీ, పోస్టల్ శాఖ 'గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్' పేరిట ప్రమాద బీమాను అందిస్తున్నాయి. రూ.399 చెల్లిస్తే రూ.10 లక్షల ప్రమాద బీమా అందుతుంది. ప్రమాదంలో మరణం లేదా వైకల్యం కలిగినా పూర్తి బీమా లభిస్తుంది. ప్రమాదం తర్వాత ఆసుపత్రిలో చేరినట్లయితే రూ.60 వేలు, ఔట్‌పేషెంట్ చికిత్సకు రూ.30 వేలు అందజేస్తారు. 18-65 ఏళ్లలోపు వారు ఈ పాలసీకి అర్హులు. మరిన్ని వివరాల కోసం పోస్టల్ పేమెంట్ బ్యాంకును సంప్రదించవచ్చు.