నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 4 గంటలుగా పోసానిని అన్నమయ్య జిల్లా ఎస్పీ, సీఐ ప్రశ్నిస్తున్నారు. విచారణకు పోసాని సహకరించడంలేదని, ఇప్పటివరకు ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నాడని పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అన్నమయ్య కోర్టుకు మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హాజరైయ్యారు. పోసాని తరుపున ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.