బీజేపీలోకి హరీష్ రావు.. కేసీఆర్ కొత్త కుట్ర: కాంగ్రెస్ నేత

69చూసినవారు
బీజేపీలోకి హరీష్ రావు.. కేసీఆర్ కొత్త కుట్ర: కాంగ్రెస్ నేత
టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అల్లుడు హరీష్ రావును బీజేపీలోకి పంపి పార్టీని కాపాడుకునే కొత్త కుట్రలకు కేసీఆర్ తెరలేపుతున్నారు. నువ్వు కొట్టినట్టు చెయ్యి.. నేను తిట్టినట్టు చేస్తా అనే మీ పాత ఎత్తుగడలు అర్థం కాక మీ ఎమ్మెల్యేలు ఆగమవుతున్నారు. బిడ్డ, పార్టీ, ఆస్తుల కోసం అల్లుడు హరీశ్ భుజంపై తుపాకీపెట్టి కాల్చే కుట్రలను తెలంగాణ గమనిస్తోంది' అని ట్వీట్ చేశారు.
Job Suitcase

Jobs near you