ఏపీలో ప్రజలు కులాలకే ప్రాధాన్యత ఇస్తారని పవన్ కళ్యాణ్ పలు సందర్భాలలో వెల్లడించారు. గత ఎన్నికల్లో కాపు కులస్తులే నిర్ణయాత్మకంగా మారారని సర్వేలు చెబుతున్నాయి. వైసీపీ ఓటమికి కారణమైన కాపు కులం పై జగన్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి దూరమవుతున్న ఆ సామాజిక వర్గ నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీలోని కీలక పదవులను అప్పగిస్తున్నారని తెలుస్తోంది. జగన్ వేసిన ఈ కొత్త ప్లాన్ పై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.